architect: రికార్డు సృష్టించిన భారత ఆర్కిటెక్ట్.. ‘ఆర్కిటెక్చర్ నోబెల్’ గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు!

  • దోషి సేవలను గుర్తించిన ప్రిట్జ్‌కెర్ జ్యూరీ
  • నోబెల్‌తో సమానమైన ప్రిట్జికెర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ ప్రకటన
  • మేలో టొరొంటోలో ప్రదానం

భారత్‌కు చెందిన దిగ్గజ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి (90) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆర్కిటెక్చర్ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను నోబెల్‌తో సరిసమానమైన ‘ప్రిట్జికెర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్’ను అందుకోనున్నారు. పూణెలో జన్మించిన దోషి ఈ గౌరవాన్ని అందుకోనున్న తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నారు.

ఈ రంగంలో ఇదే అత్యున్నత పురస్కారం. గతంలో ఈ అవార్డును ప్రపంచ దిగ్గజ ఆర్కిటెక్ట్‌లు అయిన జహా హడిడ్, ఫ్రాంక్ గెహ్రీ, ఐఎం పీ, షిగెరు బన్ తదితరులు అందుకున్నారు. కొన్నేళ్లుగా దోషి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్టు ప్రిట్జ్‌కెర్ జ్యూరీ తెలిపింది. మేలో టొరొంటోలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

More Telugu News