ram: 'గరుడ వేగ' దర్శకుడితో రామ్

  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి 
  • ఈ ఏడాదిలోనే విడుదల
తెరపై దూకుడు పాత్రల్లో ఎక్కువగా కనిపించే రామ్, కథల ఎంపిక విషయంలోను అదే దూకుడును ప్రదర్శిస్తూ ఉంటాడు. అలా ఆయన తాజాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ .. మేఘా ఆకాశ్ కథానాయికలు. ఈ సినిమా తరువాత ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

'గరుడ వేగ' హిట్ తో ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు. ఆయన వినిపించిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంలో ప్రవీణ్ నిమగ్నమై వున్నాడని అంటున్నారు. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేసి, ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచనలో ప్రవీణ్ వున్నాడని అంటున్నారు.   
ram
praveen sattharu

More Telugu News