kishan reddy: మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మ!: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఆ పార్టీదే
  • మతపరమైన రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని టీఆర్ఎస్ కోరుకుంటోంది
  • ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను గిరిజనులకు బదలాయించాలి
  • మీడియాతో బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ పై తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ చేతిలో టీఆర్ ఎస్ కీలుబొమ్మని, థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఆ పార్టీదేనని విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మతపరమైన రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని, రిజర్వేషన్ల నిర్ణయం రాష్ట్రాలకే ఉండాలనడం సబబు కాదని, కేసీఆర్ ఆలోచనను దేశ ప్రజలపై రుద్దాలనుకోవడం తెలివితక్కువ తనమని మండిపడ్డారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను గిరిజనులకు బదలాయించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.


 
kishan reddy
bjp

More Telugu News