sonia gandhi: విపక్షాలకు సోనియా డిన్నర్... టీడీపీ కూడా హాజరయ్యే అవకాశం

  • ఈ నెల 13న జరిగే అవకాశం
  • 17 పార్టీలకు ఆహ్వానాలు
  • పార్లమెంటులో కలసికట్టుగా పోరాడే ప్రయత్నం
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ కూటమి సారథి సోనియాగాంధీ మరోసారి రాజకీయ వ్యూహ రచనలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో  బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. విపక్ష నేతలకు ఆమె డిన్నర్ ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఏఐసీసీ ప్లీనరీ సమావేశం ఈ నెల 16-18 మధ్య జరగనుంది. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
sonia gandhi
opposition

More Telugu News