ప్రియురాలిని కడతేర్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళి కట్టాడు!
- ఆత్మకూరులోని వినాయక ఆసుపత్రిలో పని చేస్తున్న భార్గవి, నరేందర్
- భార్గవి, నరేందర్ మధ్య నాలుగేళ్ల ప్రేమ
- పెళ్లి కుదరడంతో భార్గవిని హత్యచేసిన నరేందర్
ఆ తర్వాత కులాలు వేరని చెబుతూ ఆమెను దూరం పెట్టిన నరేందర్, మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో భార్గవి అతనిని నిలదీసింది. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించి, గత శనివారం బుజిలాపురం సమీపంలోని తమ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి, వెనుకనుంచి రాయితో ఆమె తలపై మోది హతమార్చాడు. అనంతరం అదే బావి వద్ద ఆమెను పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లిపోయాడు.
మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో భార్గవి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, నరేందర్ పై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పెళ్లయిన మరుసటి రోజు పోలీసులు నరేందర్ ను విచారించగా, తన పెళ్లికి అడ్డుగా ఉండడంతోనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో తన వ్యవసాయ బావివద్ద గల మొరం గడ్డ వద్ద గుంతతీసి మృతదేహాన్ని పాతిన ప్రదేశాన్ని చూపెట్టాడు. మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు, నరేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.