Jagan: 5న ధర్నా, 21న అవిశ్వాసం, ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా: తేల్చిచెప్పిన వైఎస్ జగన్

  • ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర
  • ఢిల్లీలో ధర్నా నిమిత్తం ఎంపీలకు వీడ్కోలు
  • స్పీకర్ ఫార్మాట్ లోనే ఎంపీల రాజీనామాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తాము చేస్తున్న పోరాటంలో తుదిదశ ప్రణాళికను వైకాపా అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. హోదా సాధన కోసం ఢిల్లీలో ధర్నా చేసేందుకు బయలుదేరిన నేతలను సాగనంపిన ఆయన, అంతకుముందు వారికి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం శివరాంపురం వద్ద ఉన్న ఆయన్ను వైసీపీ ఎంపీలు, నేతలు కలువగా, వారితో సమావేశమైన జగన్, 5న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని సూచించారు.

 ఆపై 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడదామని, అప్పటికీ హోదా ఇవ్వకుంటే, చివరి అస్త్రంగా వచ్చే నెల 6వ తేదీన ఎంపీల రాజీనామాలు ఉంటాయని ఆయన అన్నారు. నేతల రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంటాయని, అదే వైకాపా చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాపై పోరాటం క్లైమాక్స్ కు చేరిందని అభిప్రాయపడ్డ ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

More Telugu News