ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్.. ఏకపక్షంగా కాల్పులు జరిపారు: మావో నేత జగన్

  • కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే ఎన్ కౌంటర్
  • ముందు రోజు రాత్రే పోలీసులు చుట్టుముట్టారు
  • కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో కాల్పులు జరిపారు
నిన్న ఉదయం తెలంగాణలోని వెంకటాపురం-చర్ల మండలాలు, చత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దుల వద్ద జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 10 మంది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ గ్రేహౌండ్స్ కమెండో కూడా ప్రాణాలు వదిలారు. ఈ ఎన్ కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను కాపాడేందుకే ఎన్ కౌంటర్ చేశారని మండిపడ్డారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ముందురోజు రాత్రే పోలీసు బలగాలు చుట్టుముట్టాయని... కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డారని అన్నారు.

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మరణించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇందులో వాస్తవం లేదని జగన్ చెప్పారు. హరిభూషణ్, రాజిరెడ్డి, దామోదర్ అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారిలో కాజీపేట మండలం రాంపేట్ కు చెందిన దూడబోయిన స్వామి అలియాస్ సుధాకర్, బీజాపూర్ కు చెందిన రత్న ఉన్నారని... మిగిలినవారంతా చత్తీస్ ఘడ్ కు చెందినవారని చెప్పారు. 
Go Back to Shorts
encounter
maoist
police
jagan
fake encounter

More Telugu News