అమ్మకోసం మనసు మార్చుకున్న బాలుడు
Add ap7am to your home Screen

అమ్మకోసం మనసు మార్చుకున్న బాలుడు

  • తల్లి వినతి మేరకు హింసా మార్గానికి స్వస్తి
  • తిరిగి కుటుంబానికి చేరువైన వైనం
  • బాలుడి వివరాల వెల్లడికి డీజీపీ నిరాకరణ
కశ్మీర్‌లో ఉగ్రవాదం వైపు మొగ్గుచూపి ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలుడు తన తల్లి వినతి మేరకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తల్లి కోసం అతను సన్మార్గంలో నడిచేందుకు నిర్ణయించుకున్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "తల్లి బాధను అర్థం చేసుకుని మరో బాలుడు హింసా మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నాడు" అని డీజీపీ ఎస్‌పీ వాయిద్ ట్వీట్ చేశారు.

కుటుంబమంతా సంతోషంగా తిరిగి కలిసిమెలిసి ఉండాలని ఆయన మరో ట్వీట్‌లో ఆకాంక్షించారు. అయితే సదరు బాలుడి భవిష్యత్ దృష్ట్యా అతనికి సంబంధించిన పేరు, వయసు తదితర వివరాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. కాగా, 2017లో ఉగ్రవాదానికి ఆకర్షితులై ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు కశ్మీరీ యువకులు ఆ మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి తిరిగి చేరుకున్నారని ఆయన చెప్పారు.
Kashmir
DGP S P Vaid
Family

More Telugu News