chennai: చెన్నైలో మోదీకి ‘చెప్పు’ చూపించిన వ్యక్తి అరెస్టు.. రిమాండ్
రెండు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రభుత్వ పథకాన్ని ఆవిష్కరించడానికి చెన్నైకి వెళ్లగా ఓ వ్యక్తి చెప్పు చూపిస్తూ అవమానించాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సుమోటోగా ఫిర్యాదు నమోదు చేసుకుని, ఈ ఘటనకు పాల్పడ్డ పాల్లి అనే వ్యక్తిని అరెస్టు చేసి తాజాగా ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.