నెరవేరిన హర్మన్ ప్రీత్ కౌర్ చిరకాల వాంఛ
- పంజాబ్ పోలీస్ శాఖలో పని చేయాలని కలలుగన్న హర్మన్ ప్రీత్
- ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం
- వరల్డ్ కప్ తరువాత డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసిన పంజాబ్ ప్రభుత్వం
ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, దేశానికి గర్వకారణంగా నిలిచిన హర్మన్ ప్రీత్ తన బాధ్యతలు మరింత నిబద్ధతతో చేపడతారని ఆశిస్తున్నానని అన్నారు. వృత్తిలో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేస్తోన్న హర్మన్ ప్రీత్ కు ఒప్పంద కాలం పూర్తికాకపోవడంతో సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆమె డీఎస్పీ ఉద్యోగం స్వీకరించేందుకు సహాయం చేసిన సంగతి తెలిసిందే.