virat: నాని చేతులమీదుగా 'పరిచయం' ఫస్టులుక్ .. టీజర్

  • ప్రేమకథా కావ్యంగా 'పరిచయం '
  • దర్శకుడిగా లక్ష్మీకాంత్
  • నాయకా నాయికలుగా విరాట్ .. సిమ్రత్ కౌర్  

తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథా కావ్యాలు ఆవిష్కరించబడ్డాయి. మనసుకు హత్తుకునే ప్రేమకథా చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలా యూత్ హృదయాలను దోచుకోవడానికిగాను 'పరిచయం' అనే సినిమా రూపొందింది. రియాజ్ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మీకాంత్ దర్శకుడిగా వ్యవహరించాడు.

విరాట్ .. సిమ్రత్ కౌర్  ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటలకు నాని చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఫస్టులుక్ తోను .. టీజర్ తోను యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.  

More Telugu News