e maya chesave: "అమ్మాయిలు ఆటబొమ్మలు, నేనాడుకుంటా" అంటున్న విజయ్ దేవరకొండ... దుమ్ము రేపుతున్న 'ఏం మంత్రం వేసావె' థియేటరికల్ ట్రైలర్

  • 'ఏ మంత్రం వేసావె' థిటేటరికల్ ట్రయిలర్ విడుదల
  • యూత్ ను ఆకర్షిస్తున్న విజయ్ డైలాగులు
  • ఆన్ లైన్ గేమ్ ఆధారంగా నడిచే కథ
'అర్జున్ రెడ్డి' హిట్ తో యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం 'ఏ మంత్రం వేసావె' థిటేటరికల్ ట్రయిలర్ విడుదలై దూసుకెళుతోంది. ఈ చిత్రంలో విజయ్ చెప్పిన డైలాగ్స్ యూత్ ను అలరిస్తున్నాయి. "గేమింగ్ అతని ప్రపంచం. గాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్" అంటూ ఓ యువతి చెప్పే గొంతుకతో ట్రయిలర్ ప్రారంభమవుతుంది.

అమ్మాయిలంటే తనకు కేవలం ఆటబొమ్మలేనని, వారితో తాను ఆడుకుంటానని విజయ్ గుణాన్ని వర్ణించేలా "గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెమ్" అని విజయ్ చెప్పిన డైలాగు కూడా ఉంది. ఆ తరువాత విజయ్, హీరోయిన్లు ఓ ఆన్ లైన్ గేమ్ ను స్టార్ట్ చేయడం, విలన్ పరిచయం, హీరోయిన్ కష్టాల్లో ఉందని తెలుసుకున్న హీరో సాయం చేస్తాడన్న కోణంలో ట్రయిలర్ సాగింది.

చివరిగా, "ఐ డోంట్ నో ఎబౌట్ లవ్. బట్ షీ మేక్స్ మీ ఫీల్ సమ్ థింగ్ ఇన్ సైడ్" అన్న విజయ్ డైలాగుతో ట్రయిలర్ ముగుస్తుంది. 'ఏ మంత్రం వేసావె' థిటేటరికల్ ట్రయిలర్ ను మీరూ చూడవచ్చు.
e maya chesave
Trailar
Vijay Devarakonda
New Movie

More Telugu News