wallets: నేటి నుంచి వ్యాలెట్లకు పరిమితులు... పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చు

  • పూర్తి కేవైసీ మినహాయింపులకు గడువు సమాప్తం
  • నేటి నుంచి వ్యాలెట్లలో నగదు నింపుకోవాలంటే కేవైసీ ఇవ్వాల్సిందే
  • అమల్లోకి వచ్చిన ఆర్ బీఐ ఆదేశాలు

పేటీఎం, మొబిక్విక్ తదితర ప్రీపెయిడ్ వ్యాలెట్లు నేటి నుంచి అన్ని రకాల సేవలకు అనుకూలించకపోవచ్చు. ఇది కేవేసీ వివరాలు ఇవ్వని యూజర్లకే. ఎందుకంటే ఆర్ బీఐ ఇచ్చిన కేవైసీ గడువు నిన్నటితో ముగిసింది. ప్రతీ కస్టమర్ గుర్తింపునకు సంబంధించి ధ్రువీకరణలను (ఆధార్ లేదా పాన్ నంబర్) తీసుకోవాలన్నది ఆర్ బీఐ ఆదేశ సారాంశం. కనుక ఈ వివరాలు ఇవ్వని కస్టమర్లు కేవలం రీచార్జ్, బిల్లు చెల్లింపులు వంటి సాధారణ సేవలకు వ్యాలెట్లను ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు.

కానీ వ్యాలెట్ల నుంచి బ్యాంకుకు, ఇతరులకు నగదు బదిలీలకు అవకాశం లేదు. అలాగే, తాజాగా ఈ వ్యాలెట్లలో మనీ లోడ్ చేసుకునేందుకు కూడా వీలుండదు. అయితే, పేటీఎం ఈ రోజు కూడా క్యాష్ లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తూనే ఉంది. మొబిక్విక్ మాత్రం ఆధార్ నంబర్, పేరు వివరాలు ఇవ్వడం ద్వారా పూర్తి కేవైసీ పూర్తి చేస్తేనే బ్యాలెన్స్ యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఇతరులకు ఆ అవకాశాన్ని నిలిపివేసింది. పూర్తి కేవైసీ వివరాలు ఇవ్వకపోయినా రూ.10,000 వరకు లోడ్ చేసుకునేందుకు అనుమతించాలని కంపెనీలు కోరినప్పటికీ ఆర్ బీఐ నో చెప్పేసింది. ప్రతీ చెల్లింపుల సాధనం కేవైసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.

More Telugu News