venkatesh: 'ఆట నాదే వేట నాదే' ప్రత్యేకత ఇదే!

  • తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే'
  • వెంకటేశ్ సరసన శ్రియ 
  • కీలకమైన పాత్రలో నారా రోహిత్

తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు తేజ దర్శకత్వం వహించిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ కావడంతో, అదే తరహాలో ఈ సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రియను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సుభాష్ చంద్ర బోస్' వచ్చిన సంగతి తెలిసిందే.

 ఇప్పుడు ఈ జంట కాంబినేషన్లో 'ఆట నాదే వేట నాదే' రూపొందుతోంది. వెంకటేశ్ కి ఇది 72వ సినిమా కాగా .. శ్రియకి కూడా 72వ సినిమానే .. అదే ఈ సినిమా ప్రత్యేకత. సురేశ్ బాబు .. అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనూప్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. చాలావరకూ నూతన నటీనటులు నటిస్తోన్న ఈ సినిమాలో, నారా రోహిత్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.       

More Telugu News