BSNL: బీఎస్ఎన్ఎల్ ‘హోలీ ధమాకా’.. 30 జీబీ డేటాతో సరికొత్త ప్లాన్

షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ హోలీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ‘హోలీ ధమాకా’ పేరుతో రూ.399తో సరికొత్త పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఖాతాదారులకు అపరిమిత కాల్స్, 30 జీబీ డేటా లభిస్తుంది.

నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ ప్లాన్‌‌ను దేశంలోని వినియోగదారులందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, 30 జీబీ డేటాకు రోజు వారీ పరిమితి లేదు. కొత్త, పాత వినియోగదారులందరూ ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లోకల్, ఎస్టీడీతోపాటు రోమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితమని పేర్కొంది.
Go Back to Shorts
BSNL
Postpaid
Jio
Airtel
Vodafone

More Telugu News