bsnl: రిలయన్స్ జియోకి పోటీగా కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్!

షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఈ మధ్యే  'మ్యాక్సిమమ్' ఆఫర్ పేరిట రూ.999 రీచార్జ్ తో ప్రవేశపెట్టిన ప్లాన్ ప్రకారం, అపరిమిత కాల్ సౌకర్యాన్ని 181 రోజులు, రోజుకు 1జీబీ డేటా చొప్పున 365 రోజులు వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే తాజాగా రిలయన్స్ జియోకి పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.448 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీనిలో అపరిమిత నేషనల్, రోమింగ్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100ఎస్ఎంఎస్ లను పొందుతారు.

అలాగే 3జీ నెట్ వర్క్ వేగంతో రోజుకి 1జీబీ డేటాను వినియోగదారులు పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. కాగా జియో రూ.449 ప్లాన్ లో అపరిమిత కాల్స్, 1.5జీబీతో పాటు 91 రోజుల వాలిడిటీని ఇవ్వగా, ఎయిర్ టెల్ రూ.448 ప్లాన్ లో అపరిమిత కాల్స్, 1.4జీబీ తో పాటు 82 రోజుల వాలిడిటీని ఇస్తుంది.
Go Back to Shorts
bsnl
jio
airtel

More Telugu News