Siddhapuram: 'సూపర్‌స్టార్' దత్తత గ్రామంలో స్కూలు ప్రారంభం

  • బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సూపర్ స్టార్
  • స్కూలుకు నానమ్మ పేరు నామకరణం
  • తెలంగాణలోనూ సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న 'శ్రీమంతుడు'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న హీరో మహేష్‌బాబు దత్తత గ్రామం 'బుర్రిపాలెం'లో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనం, తరగతి గదులు ప్రారంభమయ్యాయి. వీటి ప్రారంభంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూలుకు సూపర్‌స్టార్ కృష్ణ తల్లి నాగరత్నమ్మ పేరు పెట్టారు.

'శ్రీమంతుడు' చిత్రం స్ఫూర్తితో ఆ సినిమా హీరో మహేష్‌బాబు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, కొత్తూరు మండలంలో ఉన్న సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు గ్రామాల్లో రోడ్లు, కరెంటు, తాగునీరు, పాఠశాలలు లాంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News