neet-2018: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా మరో 7 'నీట్' పరీక్షా కేంద్రాలు

  • ఆంద్రప్రదేశ్ కు కొత్తగా ఐదు నీట్ పరీక్షా కేంద్రాలు
  • తెలంగాణలో మరో రెండు పరీక్షా కేంద్రాలు
  • ఈ ఏడాది నుంచే అమలు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యవిద్య ప్రవేశపరీక్ష 'నీట్' రాయనున్న విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ శుభవార్త చెప్పింది. నీట్ ‌ప్రవేశ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు మరో 7 కొత్త కేంద్రాలను కేటాయించినట్లు తెలిపింది. నీట్ రాయాలనుకున్న విద్యార్థులు ఇంతవరకు హైదరాబాదు, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి కేంద్రాల్లో మాత్రమే రాసే వెసులుబాటు ఉండేది.

రెండు రాష్ట్రాల వినతుల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరంలలో నీట్ కేంద్రాలను ఏర్పాట్లు చేయనున్నామని, అలాగే తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డిలలో నీట్ పరీక్షా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని చెప్పింది. 2018 నీట్‌ పరీక్షను ఈ కొత్తకేంద్రాల్లో కూడా నిర్వహించనున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. 

More Telugu News