Nagarjuna: 'అనుకున్నామని జరగవు అన్నీ' అంటూ వర్మకు ట్వీట్ చేసిన నాగార్జున

  • శ్రీదేవి మృతి నేపథ్యంలో ట్విట్టర్ సంభాషణ
  • ఓ వైపు బాధ పెట్టుకుని మరోవైపు తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల చేసిన వర్మ
  • 'అనుకోలేదని ఆగవు కొన్ని' అని నాగ్‌ ట్వీట్‌  

దుబాయిలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన సినీనటి శ్రీదేవిపై ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తన కొత్త సినిమా టైటిట్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల తేదీని విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు.

ఆ సినిమా హీరో నాగార్జున.. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ... నీ ఉద్దేశం నాకు తెలుసు రామ్ గోపాల్ వర్మ అని, ఈ సమయంలో తాను ఓ పాటలోని ఓ లైనుని గుర్తు చేస్తున్నానని చెబుతూ, 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అంటూ ట్వీట్‌ చేశారు. ఆ సినిమా పాట అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'మురళీకృష్ణ' సినిమాలోది. 

More Telugu News