Uttar Pradesh: 'భారత్ మాతాకీ జై' అనని వాళ్లంతా పాకిస్ధాన్ వాళ్లే: సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

  • రెండోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ ఎమ్మెల్యే 
  • నిన్న వివాదాస్పద వ్యాఖ్యతో వివాదం కొనితెచ్చుకున్న గిరిరాజ్ సింగ్
  • సోషల్ మీడియాలో విమర్శలు

బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతోంది. గత నెలలో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన దేశాన్ని విభజించింది ముస్లింలే. కాబట్టి వారంతా దేశం వదిలి వెళ్లిపోవా’లని సంచలన వ్యాఖ్యలు చేయగా, నిన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, భారతీయులంతా రాముడి వారసులేనని పేర్కొని కలకలం రేపారు.

తాజాగా అదే పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే బైరియా సురేంద్ర నారాయణ్‌ సింగ్‌ బాలియాలో జరిగిన బహిరంగ సభలో ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించని వాళ్లందరూ పాకిస్థాన్‌ కు చెందిన వాళ్లేనని వ్యాఖ్యానించి మరో వివాదం రేపారు. ఆయన గతంలో ‘2024లోపు భారత్‌ సంపూర్ణ హిందూ దేశంగా మారనుంది. ఒకసారి హిందూ రాష్ట్రంగా మారిన తర్వాత హిందూ సంప్రదాయాలను ఆపాదించుకున్న ముస్లింలు మాత్రమే ఈ దేశంలో ఉంటారు’ అంటూ పెనుదుమారానికి కారణమయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

More Telugu News