sri devi: శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్రలేదు: దుబాయ్ పోలీసుల ప్రకటన

  • దుబాయ్ పోలీసులకు అందిన శ్రీదేవి ఫోరెన్సిక్ నివేదిక
  • శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం జారీ
  • ఈరోజు రాత్రి పది గంటల తర్వాత ముంబైకు చేరనున్న ఆమె మృతదేహం  
ప్రముఖ నటి శ్రీదేవి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. శ్రీదేవికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక దుబాయ్ పోలీసులకు అందింది. శ్రీదేవి మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేశారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ కు తరలింపు ఏర్పాట్లకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొంచెం సేపట్లో శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగిస్తారు. ఈరోజు రాత్రి పది గంటల తర్వాత ఆమె మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్టు సమాచారం. కాగా, రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
sri devi
dubai

More Telugu News