Ravichandran Ashwin: పంజాబ్ జట్టు కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్!

  • ఐపీఎల్ లో అశ్విన్ కు కొత్త హోదా
  • పంజాబ్ జట్టు కెప్టెన్ గా ఎంపిక
  • అశ్విన్ పేరును ప్రతిపాదించిన సెహ్వాగ్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కెప్టెన్ పదవి వరించింది. ఐపీఎల్ సీజన్-11 కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అశ్విన్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత సీజన్ లలో పూణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున అశ్విన్ ఆడాడు. ఈసారి జరిగిన వేలంపాటలో అశ్విన్ పట్ల చెన్నై జట్టు మొగ్గు చూపలేదు. చివరకు పంజాబ్ జట్టు అశ్విన్ ను రూ. 7.6 కోట్లతో కొనుగోలు చేసింది. తమ జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ సలహా మేరకు అశ్విన్ కు కెప్టెన్ బాధ్యతలను అందిస్తున్నట్టు పంజాబ్ జట్టు ప్రకటించింది. గతంలో పంజాబ్ జట్టుకు యువరాజ్, సంగక్కర, గిల్ క్రిస్ట్, మురళీ విజయ్ తదితరులు కెప్టెన్ లుగా వ్యవహరించారు.  
Ravichandran Ashwin
kings ix punjab
captain

More Telugu News