jayalalitha: జయలలిత విగ్రహంలో మరొకరి పోలికలు.. సోషల్ మీడియాలో విమర్శలు

  • అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటు
  • కనిపించని జయ పోలికలు
  • మండిపడుతున్న అభిమానులు

చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో, ఆ పార్టీ నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు.  

More Telugu News