mom movie: శ్రీదేవి మరణంపై పాకిస్థాన్ నటి ఆవేదన!

  • 'మామ్' సినిమాలో కలిసి నటించిన శ్రీదేవి, సజల్ అలీ
  • ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తల్లిని కోల్పోయిన సజల్ 
  • షూటింగ్ లో సజల్ కు బాగా దగ్గరైన శ్రీదేవి
అమ్మను మరోసారి కోల్పోయానంటూ శ్రీదేవి ఆకస్మిక మృతి పట్ల ‘మామ్‌’ సినిమాలో ఆమె కుమార్తె పాత్ర పోషించిన పాకిస్థానీ నటి సజల్ అలీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గతంలో తాను శ్రీదేవితో కలసి దిగిన ఫోటోను సజల్ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. కాగా, సజల్‌ తల్లి ‘మామ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో మృతి చెందడంతో, షూటింగ్ సమయంలో ఆమెకు శ్రీదేవి బాగా దగ్గరయ్యారు.

సాధారణంగా శ్రీదేవి సెట్ లో సహ నటీనటులతో అంత తొందరగా కలవకపోయినా ఆమెను మాత్రం తల్లిలా ఆదరించారు. ఆ సినిమా ప్రచారంలో ఒక సందర్భంలో సజల్ తల్లిని కోల్పోయిన ఘటనను గుర్తుచేసుకుంటూ శ్రీదేవి భావోద్వేగంతో మాట్లాడారు కూడా.
mom movie
Sridevi
sajal ali
actress
Pakistan

More Telugu News