Sridevi: టీవీలో చూసేంత వరకు ఆ వార్తను నమ్మలేకపోయాను!: శ్రీదేవి మరణం పట్ల జయప్రద దిగ్భ్రాంతి

  • శ్రీదేవి మృతి పట్ల స్పందించిన జయప్రద
  • ఆమె మృతి నన్ను చాలా బాధించింది
  • శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించా
శ్రీదేవి మృతి పట్ల ప్రముఖ నటి జయప్రద స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు తెలియగానే ఏదో పీడకల వచ్చినట్లు భావించానని, ఆమె మృతి తనను చాలా బాధించిందని ఆమె వ్యాఖ్యానించారు. టీవీలో చూసేంత వరకు ఆ వార్తను నమ్మలేదని, శ్రీదేవితో కలిసి తాను చాలా సినిమాల్లో నటించానని అన్నారు. శ్రీదేవి అద్భుతమైన నటి, తల్లి అని ప్రశంసించారు. ఆమెలా కుమార్తెలు జాన్వి, ఖుషి కూడా తనలానే సినిమాల్లో రాణించాలని శ్రీదేవి భావించారని జయప్రద అన్నారు. 
Sridevi
jayaprada
comment

More Telugu News