Viral Videos: తండ్రికి అవమానం.. ఆ వీడియో చూసి ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

  • ఓ వ్యక్తిని మొకాళ్లపై కూర్చొబెట్టి దండం పెట్టించుకున్న బీజేపీ నేత
  • ఆ ఘటనను చిత్రీకరించి వాట్సప్‌లో పెట్టిన వైనం
  • మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘటన

తన తండ్రిని ఓ నాయకుడు అవమానించి, ఆ ఘటనను చిత్రీకరించి వాట్సప్‌లో పెట్టడంతో ఆ వీడియో చూసిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. జబల్‌పూర్‌లోని బీజేపీ మైనారిటీ సెల్‌ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌ షఫిక్‌.. ఇటీవల ఓ వ్యక్తితో డబ్బు విషయమై గొడవపెట్టుకుని ఆయనను అవమానించాడు.

అతడిని మోకాళ్లపై కూర్చొబెట్టి దండం పెట్టించుకుని వీడియో తీశాడు. అంతేగాక, అతడి వీపుపై ఓ వాటర్‌ బాటిల్‌ పెట్టాడు. ఈ వీడియోను ఆ నాయకుడు వాట్సప్‌లో పెట్టగా అది వైరల్‌గా మారింది. అవమానానికి గురైన ఆ వ్యక్తి కూతురు చదువుకునే కాలేజీలో స్నేహితుల ఫోన్‌లలోనూ కనపడింది. దీంతో తీవ్ర అవమానంగా భావించిన ఆ యువతి, ఇంటికెళ్లి పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   

More Telugu News