sridevi: దైవదర్శనానికి వెళుతుండగా వార్త తెలిసింది.. ఎంతో బాధ కలిగింది: రోజా

  • దేశానికే డ్రీమ్ గర్ల్ శ్రీదేవి
  • మాలాంటి వారందరికీ ఆమె ఓ స్ఫూర్తి 
  • ఆమెలా ఎదగాలని మేమంతా కలలుగన్నాం
శ్రీదేవి మరణించారన్న విషయం తెలియగానే చాలా భాధ వేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమెది పెద్ద వయసు కూడా కాదని.. ఉదయం దైవదర్శనానికి వెళుతుండగా ఈ విషయం చెప్పారని... చాలా బాధ పడ్డానని అన్నారు. హీరోయిన్లందరికీ శ్రీదేవి ఒక డ్రీమ్ గర్ల్, ఒక ఇన్స్పిరేషన్ అని అన్నారు. ఆమెలా అత్యున్నత స్థాయికి ఎదగాలని మేమంతా ఆశపడినవారమేనని చెప్పారు.

అలాంటి శ్రీదేవి ఇకలేదు అనగానే... జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. భారతదేశంలోనే డ్రీమ్ గర్ల్ గా వెలుగొందిన ఆమె... ఇకపై కనపించదు, వినిపించదు అనే విషయం తెలిసి అందరూ కన్నీరుమున్నీరు అవుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 
sridevi
death
roja

More Telugu News