Sridevi: దివి నుంచి భువికి దిగివచ్చిన తార శ్రీదేవి!: ఎన్‌టీఆర్

షార్ట్స్‌లో చూడండి
అతిలోకసుందరి శ్రీదేవి (55) హఠాన్మరణంపై ప్రముఖ హీరో జూనియర్ ఎన్‌టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి లేని లోటు పూడ్చలేనిదని, ఆమె స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించారని ఆయన అన్నారు.

ఆమె దివి నుంచి భువికి దిగివచ్చిందని ఆయన అన్నారు. విజయాలన్నీ సాధించిన తర్వాత ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్‌టీఆర్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
Go Back to Shorts
Sridevi
Dubai
Marriage
Death

More Telugu News