Steven Smith: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్

  • రెండు వారాల క్రితం షేన్‌వార్న్‌ను మెంటార్‌గా నియమించుకున్న ఆర్ఆర్
  • ఇప్పుడు స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన యాజమాన్యం
  • ఆనందంగా ఉందన్న స్మిత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని యాజమాన్యం ప్రకటించింది. రెండు వారాల క్రితం ఆసీస్‌కే చెందిన దిగ్గజ బౌలర్ షేన్‌వార్న్‌ను మెంటార్‌గా నియమించిన రాజస్థాన్ రాయల్స్ తాజాగా స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

గత సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌జైంట్‌కు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో అత్యధికంగా 472 పరుగులు చేశాడు. అద్భుత ఆటతీరుతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలవడంతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు స్మిత్ పేర్కొన్నాడు. వార్న్‌తో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా స్మిత్ పేర్కొన్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో తిరిగి ఆడనున్న రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

More Telugu News