nagarjuna: నాని బర్త్ డే సందర్భంగా మల్టీ స్టారర్ మూవీ పాటల రికార్డింగ్ మొదలు

  • నాగ్ - నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్ 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్

నాగార్జున .. నాని కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా కనిపించనుండగా .. నాని డాక్టర్ పాత్రను పోషించనున్నాడు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజున నాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, 'మహతి' రికార్డింగ్  స్టూడియోలో పాటల రికార్డింగ్ ను ఈ రోజున మొదలుపెట్టేశారు.

 ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ .. "నాగార్జున .. నాని వెరైటీ కాంబినేషన్లో .. ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మా బ్యానర్ కి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ ను ఆరంభించాం. మార్చిలో రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నాం. మా బ్యానర్లో వచ్చిన ఎన్నో మల్టీ స్టారర్స్ ను ఆదరించిన ప్రేక్షకులు, ఈ మల్టీ స్టారర్ ను కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు .

More Telugu News