raviteja: 'నేల టికెట్' కి .. 'సవ్యసాచి'కి పోటీ తప్పడం లేదు

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్'
  • మే 25వ తేదీన భారీస్థాయి విడుదల 
  • ఒక రోజు ముందుగానే 'సవ్యసాచి' రిలీజ్

నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' .. నాగ చైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' చేసి విజయాలను అందుకున్న కల్యాణ్ కృష్ణ, తన మూడవ సినిమాను రవితేజతో మొదలుపెట్టేశాడు. ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ఆలోచనలో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాకి ఆయన 'నేల టికెట్' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మే 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమాకి ఒక రోజు ముందుగా .. అంటే, 24వ తేదీన 'సవ్యసాచి' సినిమాను విడుదల చేయనున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీనే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News