Priya Prakash Varrier: తమన్నా, తాప్సీలను క్రాస్ చేసిన ప్రియా వారియర్..!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో 45 లక్షలకు పైగా ఫాలోయర్లు
  • కేరళ కుట్టి ఒక్కో పోస్టుకు 8 లక్షల చెల్లింపు
  • వారియర్‌కు పలు సినిమా ఆఫర్లు
ఆకట్టుకునే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో ఓవర్‌నైట్‌లో పాప్యులారిటీ సంపాదించిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ ఫాలోయర్ల విషయంలో స్టార్ హీరోయిన్లను క్రాస్ చేసేసింది. హీరోయిన్లు తమన్నా, తాప్సీ లాంటి వారిని దాటేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారియర్‌ను ఫాలో అవుతున్న వారు 45 లక్షలకు పైగానే ఉన్నారు. అంటే.. బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఇంతమంది ఫాలోయర్లు లేరంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన పాప్యులారిటీని క్యాష్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో తాను అప్ లోడ్ చేసే ఒక్కో పోస్టు ద్వారా 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తోందట. ఆమెకున్న లక్షలాది మంది ఫాలోయర్ల కారణంగా పోస్టుల అప్ లోడింగ్ ద్వారా ఆమె సంపాదన ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు.

'ఒరు అదార్ లవ్' అనే మలయాళ చిత్రంలోని ఓ పాట ద్వారా ఆమెకు ఇంత క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. 26 సెకన్ల ఆ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.
Priya Prakash Varrier
Social media
Tamannaah
Taapsee

More Telugu News