yarapathinene srinivasa rao: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: విజయసాయిరెడ్డికి యరపతినేని వార్నింగ్
- ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరిస్తున్నారు
- వైసీపీని కూకటివేళ్లతో పెకిలిస్తాం
- మేము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులం
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై విజయసాయి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు గుప్పిస్తున్నారని... ఇది సరైన పద్ధతి కాదని, ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
'వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మా అంతు చూసేది లేదు' అని ఎద్దేవా చేశారు. విజయసాయి బెదిరింపులను సహించబోమని, వైసీపీని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని అన్నారు. తాము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులమని చెప్పారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో యరపతినేని మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.