లూపస్ వ్యాధిపై పరిశోధన.. భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్ కు రూ.3.9 కోట్ల గ్రాంటు!
- 3.9 కోట్ల రూపాయల గ్రాంటును మంజూరు చేసిన లూపస్ పరిశోధక కూటమి (ఎల్‌ఆర్‌ఏ)
- ‘లూపస్ నెఫ్రైటిస్’ అనే మూత్రపిండ సంబంధిత వ్యాధికి అందుబాటులో లేని చికిత్స
- భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్ తో కూడిన ముగ్గురు పరిశోధకుల బృందం పరిశోధన
‘లూపస్ నెఫ్రైటిస్’ అనే మూత్రపిండ సంబంధిత వ్యాధి బారినపడిన వ్యక్తుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్వీయ ఆరోగ్యకణాలపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి చికిత్సను భారత సంతతి శాస్త్రవేత్త చంద్రమోహన్ తో కూడిన ముగ్గురు పరిశోధకుల బృందం అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. దీనికి ప్రభావవంతమైన చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈ వ్యాధి నిరోధానికి చంద్రమోహన్ బృందం ప్రత్యేకమైన చికిత్స మార్గాలను అభివృద్ధి చేయనుంది.