డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సీఐ.. బదిలీ చేసిన ఉన్నతాధికారులు!
- తాగి నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న ధర్పల్లి సీఐ డి.కృష్ణ
- సీఐ నంటూ తనిఖీ సిబ్బందిపై ఆగ్రహం
- కేసు నమోదు చేయాలని ఆదేశించి, ట్రాన్స్ ఫర్ చేసిన ఉన్నతాధికారులు
దీంతో తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఆయనను ఆపి తనిఖీ చేయగా తాగినట్టు తేలింది. దీంతో తాను సీఐనంటూ తనిఖీలు నిర్వహించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగరాజు ఉన్నతాధికారులను సంప్రదించగా, చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను ధర్పల్లి నుంచి హెడ్ క్వార్టర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేశారు.