Nani: 'నా కనులే కనని ఆ కలనే కలిశా' అంటోన్న నాని.. నేచురల్ స్టార్‌ కొత్త సినిమా పాట విడుదల

  • ‘కృష్ణార్జున యుద్ధం’లో నాని ద్విపాత్రాభినయం
  • ఈ చిత్రానికి 'హిప్‌హాప్‌ తమిళ' సంగీతం 
  • మేర్లపాక గాంధీ దర్శకత్వం

వరుస విజయాలతో దూసుకుపోతోన్న నేచురల్ స్టార్ నటిస్తోన్న కొత్త చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని కొత్త పాటను ఈ రోజు సినీ బృందం విడుదల చేసింది. 'నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరసా' అంటూ ఈ పాట ప్రారంభం అవుతోంది. హిప్‌హాప్‌ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’  ఏప్రిల్‌ 12న విడుదల కానుంది.   

More Telugu News