India: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్‌

  • ఒడిశా తీరంలో 'ధ‌నుష్' ప‌రీక్ష 
  • భూ, జల త‌లాల నుంచి ప్రయోగించగలిగే క్షిపణి
  • 500 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం

ఇటీవలే స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత్ ఈ రోజు మరో పరీక్ష చేసింది. అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యం క‌లిగిన బాలిస్టిక్ క్షిప‌ణి 'ధ‌నుష్' ప‌రీక్ష విజ‌య‌వంతం అయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు. ఒడిశా తీరంలో ఈ క్షిపణి పరీక్ష చేసినట్లు తెలిపారు. భూ, జల త‌లాల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెప్పారు. ఈ క్షిపణి దాదాపు 500 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వివరించారు. ఈ రోజు ఉదయం 10.52కి దీనిని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

More Telugu News