రూ.500 కోట్లతో రామాయణం... షూటింగ్ కోసం యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ!

  • యూపీ 'ఫిల్మ్ బంధు'తో ఎంఓయూ
  • నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా
  • మూడు భాషల్లో 3డీ టెక్నాలజీతో షూటింగ్
చాలాకాలంగా 'రామాయణం' తెరకెక్కనుందనే వార్త వినబడుతూనే ఉంది. ఆ శుభముహూర్తం ఎప్పుడొస్తుందా అని పురాణ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మూడు భాషల్లో 3డీ టెక్నాలజీతో ఇది రూపొందనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చలనచిత్ర విభాగం 'ఫిల్మ్ బంధు'తో నిర్మాతలు తాజాగా ఓ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నారు.

యూపీ పెట్టుబడిదారుల సదస్సు-2018 వేదికగా గురువారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ప్రకటన విడుదల చేశారు. మధు గతంలో 'గజినీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. రామాయణం చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
Go Back to Shorts
Ramayana
3D
Allu Aravind
Madhu Mantena
Namit Malhotra

More Telugu News