ఇవాళ విచారణకు వద్దు... రాంగోపాల్ వర్మకు సీసీఎస్ సమాచారం
- తొలి విచారణ తరువాత వర్మ ల్యాప్ టాప్ సీజ్
- ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ లో ల్యాప్ టాప్
- ఇంకా రాని నివేదిక
- రిపోర్టు వచ్చిన తరువాతే విచారించాలని పోలీసుల నిర్ణయం
తొలి దశ విచారణ తరువాత వర్మ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాప్ టాప్ పై ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇంకా రాకపోవడంతో, ప్రస్తుతం ఆయన్ను ప్రశ్నించేందుకు ఏమీ లేదని భావించిన సీసీఎస్ పోలీసులు, రిపోర్టు వచ్చేంత వరకూ వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమాచారాన్ని రెండు రోజుల క్రితమే వర్మకు తెలిపినట్టు సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇవాల్టి విచారణ నుంచి రాంగోపాల్ వర్మకు మినహాయింపు లభించినట్లయింది.