stock markets: ద్రవ్యోల్బణం భయాలు... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • నష్టాలతో మొదలై నష్టాలతోనే ముగిసిన మార్కెట్లు 
  • 25 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం పెరగబోతోందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో, సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అలాగే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 25 పాయింట్లు కోల్పోయి 33,819 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 10,383 వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బయోకాన్ (6.13%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (5.72%), క్వాలిటీ లిమిటెడ్ (5.63%), ఐడీబీఐ బ్యాంక్ (5.19%), కేపీఆర్ మిల్ లిమిటెడ్ (4.35%).    

టాప్ లూజర్స్:
ఫోర్టిస్ హెల్త్ కేర్ (-5.98%), వక్రాంగీ (-4.99%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-4.89%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-4.65%), పీసీ జువెలర్స్ (-4.59%).      

More Telugu News