jana sena: యూనివర్శిటీ విద్యార్థులకు టీషర్టులు పంపిణీ చేయనున్న జనసేన

  • ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్న జనసేన
  • ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అని రాసిన టీషర్టుల పంపకానికి నిర్ణయం
  • యువతను ఉత్తేజపరిచే పనిలో జనసేన

ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్శిటీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీషర్టులను పంపిణీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ టీషర్ట్ పై ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని ముద్రించారు. ఏపీ చిత్రంతో పాటు బిగించిన పిడికిలిని ప్రింట్ చేశారు. కిందవైపు జనసేన అనే పెద్ద అక్షరాలు ఉన్నాయి. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో, యువతను ఉత్తేజ పరిచేందుకు ఆ పార్టీ విద్యార్థి విభాగం విధివిధానాలను రూపొందించింది. సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యాచరణలో భాగంగానే విద్యార్థులకు టీషర్టులను పంపిణీ చేస్తోంది. 

More Telugu News