ఈజీగా ఛాన్స్ వస్తే విలువ తెలియదు: సాయిధరమ్ తేజ్

- ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను
- నేను ఫలానా అని ఎవరికీ చెప్పలేదు
- 'పిల్లా నువ్వులేని జీవితం'లో ఛాన్స్ అలా వచ్చింది
"నటన వైపు వెళ్లాలనుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను. ఈజీగా ఏ అవకాశం వచ్చినా దాని విలువ తెలియదు. అందుకే కష్టపడే అనుకున్నది సాధించాలని నిర్ణయించుకున్నాను. పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిగానే ప్రతి సినిమా ఆఫీస్ కి వెళ్లి నా ఫొటోలు .. ఫోన్ నెంబర్ ఇచ్చాను. అక్కడి మేనేజర్లకు గానీ .. అసిస్టెంట్ డైరెక్టర్లకి గాని నేను ఎవరన్నది చెప్పలేదు. 'కేరింత' ఆడిషన్స్ కి వెళ్లినందు వలన, 'పిల్లా నువ్వులేని జీవితం'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో నా కెరియర్ ఊపందుకుంది" అని చెప్పుకొచ్చాడు.