harish shankar: యంగ్ హీరోతో హరీశ్ శంకర్ 'సీటీ మార్'

  • 'దాగుడు మూతలు' పనుల్లో హరీశ్ శంకర్ 
  • ఆ తరువాత సినిమాకి కూడా సన్నాహాలు
  • 'దువ్వాడ' పాటలో నుంచి సెట్ చేసిన టైటిల్

మాస్ ఆడియన్స్ ను .. యూత్ ను కట్టిపడేసే కంటెంట్ ను ఎంచుకోవడంలో హరీశ్ శంకర్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు దర్శకత్వంలో ' దాగుడుమూతలు' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది మల్టీ స్టారర్ సినిమా .. స్క్రిప్ట్ పనులు చివరిదశకు చేరుకున్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకి 'సీటీ మార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో 'సీటీ మార్ .. సీటీ మార్' అనే సాంగ్ పాప్యులర్ కావడం వలన, జనంలోకి బాగా వెళుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారు. వరుస హిట్లు కొడుతోన్న ఓ యంగ్ హీరో ఈ సినిమాలో చేయనున్నట్టు సమాచారం.   

More Telugu News