Test Match: మిగిలేది ఈ ఐదే... టెస్టు క్రికెట్ పై కెవిన్ పీటర్ సన్ కీలక వ్యాఖ్యలు

  • 2028 నాటికి టెస్టు ఆడే దేశాలు ఐదు మాత్రమే
  • ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మాత్రమే
  • పెరగనున్న వన్డేలు, టీ-20 మ్యాచ్ ల సంఖ్య

మరో పదేళ్ల తరువాత టెస్టు క్రికెట్ ఆడేందుకు ఏ దేశమూ ఆసక్తిని చూపబోదని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్ సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2028 నాటికి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ మినహా మరే దేశమూ టెస్ట్ క్రికెట్ ఆడబోదని ఆయన జోస్యం చెప్పాడు.

శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఐదు రోజుల మ్యాచ్ కి స్వస్తి పలకనున్నాయని, కొత్తగా క్రికెట్ లో రాణిస్తున్న ఆఫ్గన్, ఐర్లండ్, యూఏఈ వంటి దేశాలు అసలు టెస్టు మ్యాచ్ లంటేనే ఆసక్తి చూపే పరిస్థితి ఇప్పటికే లేదని అన్నాడు. భవిష్యత్తులో టెస్టు మ్యాచ్ ల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, వన్డేలు, టీ-20ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, క్రికెట్ అభిమానులు తన వ్యాఖ్యలను గుర్తు పెట్టుకోవాలని కోరాడు.

More Telugu News