punjab national bank scame: పేర్లు ఎత్తకుండానే పీఎన్బీ కుంభకోణంపై పెదవి విప్పిన జైట్లీ!

  • పీఎన్బీ స్కాం బాధ్యత ఆడిటర్లు, మేనేజ్ మెంట్ దే 
  • బ్యాంకుల్లోని అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారు 
  • ఇలాంటివి గుర్తించేందుకు అవసరమైన సూపర్వైజరీ సిస్టమ్ ను బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తొలిసారి స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమాశంలో ఆయన మాట్లాడుతూ, 11,400 కోట్ల కుంభకోణానికి బ్యాంకు ఆడిటర్లు, మేనేజ్ మెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పీఎన్బీ పేరు కానీ, ఆ బ్యాంకును బురిడీ కొట్టించి విదేశాలకు చెక్కేసిన ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ పేరు కానీ ప్రస్తావించని జైట్లీ... బ్యాంకులలో జరుగుతున్న అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారని ఆరోపించారు.

బ్యాంకుల్లో జరిగే అవకతవకలను గుర్తించేందుకు అవసరమైన సిస్టమ్‌, సూపర్వైజరీ ఏజెన్సీలను బ్యాంకులు రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడే ఇలాంటి వాటిని మొగ్గలోనే గుర్తించగలుగుతాయని ఆయన చెప్పారు. నిర్ణయాధికారం బ్యాంకు మేనేజర్లకు ఉన్నప్పుడు దానిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News