Andhra Pradesh: మంత్రి లోకేశ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు

  • మంత్రి లోకేశ్ తో ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు భేటీ
  • గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్ కు ‘ఫేస్ బుక్’ సహకరించాలి : లోకేశ్
  • ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం
  • ఆన్ లైన్ మార్కెటింగ్ కు డిజిటల్ ట్రైనింగ్ ఇస్తాం: ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు

ఏపీలో ఆన్ లైన్ మార్కెటింగ్ కు ఫేస్ బుక్ సంస్థ సహకారం అవసరమని  మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధులు లోకేశ్ ను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్ కు ‘ఫేస్ బుక్’ సహకారం అందించాలని సదరు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఇంటర్నెట్ అనేది  ప్రజలకు ప్రాథమిక హక్కుగా మారనుందని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ఏపీలో ఫేస్ బుక్ విస్తరణకు ఫైబర్ గ్రిడ్ ఉపయోగపడుతుందని అన్నారు. కాగా, లోకేశ్ విజ్ఞప్తికి ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, గ్రామాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్ లైన్ మార్కెటింగ్ కు డిజిటల్ ట్రైనింగ్ ఇస్తామని లోకేశ్ తో వారు పేర్కొన్నారు.

More Telugu News