rana: 'హిరణ్యకశిప' కోసం రానాతో సెట్స్ పైకి గుణశేఖర్

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
  • 150 కోట్ల బడ్జెట్ తో రంగంలోకి 
  • ప్రధానపాత్రలో రానా  

'రుద్రమదేవి' చారిత్రక చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు గుణశేఖర్, ఇప్పుడు 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని భారీస్థాయిలో తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలాకాలంగా జరుగుతున్నాయి. ఇది 'భక్త ప్రహ్లాద' కథే అయినప్పటికీ, హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుందన్న మాట.

 టైటిల్ రోల్ ను రానా చేయనున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.

దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. దీనిని సురేశ్ ప్రొడక్షన్స్ .. గుణ టీమ్ వర్క్స్ పై సంయుక్తంగా నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారట.    

More Telugu News