apple: ఎట్టకేలకు తెలుగు బగ్ ను తొలగించిన యాపిల్... అప్ డేటెడ్ వెర్షన్లు విడుదల

  • యాపిల్ ఐవోఎస్, టీవీ ఓఎస్, వాచ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ విడుదల
  • యూజర్లు ప్రస్తుత వెర్షన్లను అప్ డేట్ చేసుకోవాలి
  • తెలుగు పదం టైప్ చేస్తే క్రాష్ అవ్వకుండా పరిష్కారం 

యాపిల్ ఎట్టకేలకు తెలుగు పదంతో వచ్చిన తంటాలను పరిష్కరించింది. 'జ్ఞా' అని టైప్ చేసిన వెంటనే అప్లికేషన్లు క్రాష్ అయిపోతుండడంతో యాపిల్ ఇంజనీర్లు దీనికి పరిష్కారం కొనుగొన్నారు. ఈ బగ్ ను తొలగించి మెరుగుపరిచిన ఐవోఎస్ 11.2.6 వెర్షన్, టీవీ ఓఎస్ 11.2.6, వాచ్ ఓఎస్ 4.2.3, మ్యాక్ ఓఎస్ 10.13.3 వెర్షన్లను విడుదల చేసింది.

 యాపిల్ ఐఫోన్, ఐపాడ్, యాపిల్ వాచ్, మ్యాక్ మెషిన్లపై ఈ తెలుగు పదం టైప్ చేయగానే క్రాష్ అవడం, ఫేస్ బుక్, జీమెయిల్, ట్విట్టర్ సహా ప్రీ ఇన్ స్టాల్డ్ మెస్సేజింగ్ యాప్ లు బ్లాక్ అవడం జరిగాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో యాపిల్ ఆ సమస్యను తొలగించి నూతన వెర్షన్లు తీసుకొచ్చింది. యూజర్లు కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవడం ద్వారా ఆ బగ్ ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ లో జనరల్ ఆప్షన్ కు వెళ్లి, సాఫ్ట్ వేర్ అప్ డేట్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

More Telugu News