lung kawi iland: 708 మీటర్ల ఎత్తులో 4 గంటల పాటు చిక్కుకుపోయిన పర్యాటకులు!

  • రిసార్ట్‌ ఐలాండ్‌ గా పేరొందిన లాంగ్‌ కవీ
  • లాంగ్‌ కవీకి పర్యాటకుల తాకిడి ఎక్కువ
  • కేబుల్ కార్ లో చిక్కుకుపోయిన పర్యాటకులు

మలేసియాలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మలేసియాలో రిసార్ట్‌ ఐలాండ్‌ గా పేరొందిన లాంగ్‌ కవీకి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకుల్లో చాలా మంది కేబుల్‌ కార్లలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు మొగ్గు చూపుతుంటారు. తాజాగా వెలుగు చూసిన ఘటనలో కూడా 89 మంది ప్రయాణికులు కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ కిందనున్న ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న సమయంలో కేబుల్ కార్లు నిలిచిపోయాయి.

తొలుత ఎక్కువసేపు ప్రకృతిని వీక్షించవచ్చని సరదా పడిన పర్యాటకులు గంటలు గడుస్తున్నప్పటికీ కేబుల్ కార్లు కదలకపోవడంతో ఆందోళన చెందారు. సుమారు నాలుగు గంటలపాటు 89 మంది ప్రయాణికులు సముద్ర మట్టానికి 708 మీటర్ల ఎత్తులో గాల్లో వేలాడుతూ ఉండిపోయారు. కేబుల్ కార్ లో బేరింగ్ చెడిపోవడంతో అసౌకర్యం కలిగిందని కేబుల్ కార్ నిర్వాహకులు తెలిపారు. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి, రాత్రి 9:30 గంటల సమయంలో పర్యాటకులను సురక్షితంగా బేస్ స్టేషన్ కు తీసుకురావడంతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 

More Telugu News