Chandrababu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల స‌మ్మెకు కాంగ్రెస్ మ‌ద్దతు: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స‌మ్మెకు త‌మ పార్టీ మ‌ద్దతు ప‌లుకుతున్న‌ట్లు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో దాదాపు 7,500 మంది విద్యుత్ ఉద్యోగులను రెగ్యులర్ చేశామని, వచ్చే ఎన్నికల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చి తాము కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పడమే కాకుండా, మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించనందుకే రేపటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారన్నారు. 
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Congress
raghu veera reddy

More Telugu News